మురుగా మురుగా మురుగా
నాలో ఉంటూ నాలోనూ లేక, ఉండి లేక, లేక ఉండి లేకుండా ఉండీ ఉండుండీ ఉంటూ లేక లేక ఉంటూ ఉండుండీ ఉండ లేక
మురుగా మురుగా మురుగాకవిత రాసేదేవరూ, కవిత రాయించేదెవరూ కవిత వినేదెవరూ , కవిత వినిపించేదెవరూ? ఇతరులు లేక నా చేతన యుండి యుండెనా నేను లేక ఇతరులు ఉండి యుండెనా- ఏది ఎలా సాధ్యమ్ము? మురుగా రమణా రమణా మురుగా, ఏది నిజము ఏది అబద్ధము, ఏది సహజము ఏదేది అ సహజము ఏది సమాజము ఏది నీ అసమాజము? ఏదీ ఆ సమాజము?
సంస్క్రుతి లేక ప్రకృతి యుండెనా లేక
ప్రకృతి నుండి సంస్క్రుతి వచ్చెనా లేక
సంస్క్రుతియే ప్రకృతిని ఇచ్చెనా?నాఆ
మురుగా మురుగా మురుగా
నీవు లేవు నేను లేను ముఖ కవళికలతో ఈ పదములు లేవు దీనిని చదువువాడు లేడు దీనిని రాయువాడు లేడు - ఇంతకూ నేనెందుకు వస్తిని ఈ అంతర్జాల మార్జాల బస్తీకి అమ్మల గన్న అమ్మతో చివికి చిక్కి రోదించే ఈ రాత్రి వెన్నెల భూమాతతో?
No comments:
Post a Comment