08 August 2012

చావు

నీ పల్చని పాదాలు రగిలి రగిలి
ఎండకు నీ ముఖం పిగిలి పిగిలి
నీ చల్లని చేతులు వొణికి వొణికి

మధ్యాహ్నం
మూడింటికి
కుదేలవుతున్న ఆకలి కడుపుతో వడివడిగా ఇంటికి వచ్చి
నిన్న రాత్రి దాచుకున్న ఆ అన్నం గిన్నెలోకి
నీ ముఖాన్ని వొంచితే, జువెరియా తబుస్సుం

దాచుకున్న అన్నం మెతుకులుకు నీళ్ళు పట్టి
పాచి వాసన ఒక పామై
నిన్ను నిలువునా నుదిటిన కాటు వేసిననాడు

నీ కన్నీళ్లు ఏమైనాయి, ఆ సత్తు గిన్నెలో
రాలిపడి ఏడ్చిన నా నీలి చావు ఏమైనాదీ?

No comments:

Post a Comment