21 August 2012

నీ చేతులంటిన కళ్ళు

నీ ముంజేతుల మీద వాలిన కళ్ళను
ముని వేళ్ళతో నిమిరి
వాటి తేమను తుడిచి

నింపాదిగా వొదిలివేసావు నువ్వు. యిక

నీ చేతులంటిని కళ్ళు
రెక్కలు విరిగిపోతో ఏ
దిగంతాలలోకి రాలి చిట్లి చీలికలైపోయాయో

తెలుసా నీకు ఏమైనా?

1 comment:

  1. vodiley,,, inka aa ammaini pattukuni , vishaadaanni pattukuni em chestam
    manchi kavitvam raase shakti vunnappudu
    daanni vruda cheyyaku.

    ReplyDelete