కనులపై పల్చటి పొరలా వ్యాపిస్తున్న
చెమ్మతో తను అడిగింది యిలా
17.08.2012 సాయంత్రంనాడు-
'ఏం చెప్పను?
నీకు? నీకూ?
వాన నీటిని దాచుకున్న ఈ చెట్టుని
ఎవరైనా గట్టిగా ఊపితే బావుండు-'
యిక ఒక చీకటి బాకుతో ఛాతిని
నిలువునా చీల్చుకుని
ఇంటికేనా వెళ్ళింది నేను
గూటిలోంచి రాలి
చితికిన రెండు పావురపు గుడ్ల వంటి
తన కళ్ళని నా అరచేతుల్లో దాచుకుని?
గూటిలోంచి రాలి
ReplyDeleteచితికిన రెండు పావురపు గుడ్ల వంటి
తన కళ్ళని నా అరచేతుల్లో దాచుకుని?