02 August 2012

మంత్రగత్తె

ఎండలోకి చినుకూ
చినుకులోకి ఎండా
కలసి కలగలసి గాలికి పరదాలు పరదాలుగా రెపరెపలాడే సమయం యిది. యిక

తన రూపపు తీవ్రతతో మూతబడ్డ కనులతో
నుదిటిన మంత్రించబడ్డ బాకు మొనతో
తనని స్మరించుకోవాల్సిన సమయమూ యిదే. చూడు

ఎండా వానా కలగలిసిన
ఎలాంటి మంత్రగత్తో తను!

No comments:

Post a Comment