31 August 2012

దీవెన

అరచేతులలాంటి ఆకులు
ఆకు పచ్చగా విచ్చుకుని
వానకీ గాలికీ మధ్య క్షణకాలం ఆగినప్పుడు   

నీ ముఖం గుర్తుకు వస్తుంది
మబ్బులు కమ్ముకున్న ఈ
దిగులు కాలాలలో లోకాలలో.

ఇక, వంచిన తల ఎత్తుకుని
నిండుగా నిటారుగా నిలబడి

సూటిగా ఈ మనుషుల
ఇరుకు కళ్ళలోకి చూస్తూ
ఇంటికి వెడతానిక నేను

హృదయంలో ఒక దీపంతో  
నీ రహస్య నామ స్మరణతో.
దీవించు నన్ను.  

No comments:

Post a Comment