సరళమైన నీటి చెలమలో
ప్రసన్నమైన వదనంతో
ఎవరో వెలిగించిన స్మృతి ప్రమిదెవు నువ్వు: రాత్రిపూట
వీచే సన్నటి గాలిలో, ఒక దిగులులో
ఆ దీపపు కాంతిలో నీ నీటిలోతుల్లో
నా ప్రతిబింబం చూసుకోడానికైనా
నీ అరచేతుల్లో నీళ్ళు అందుకుని
నా ముఖం కడుక్కోవడానికైనా, ఆఖరకు మంటని తాకడానికైనా
దీపం ఆర్పి వేయడానికైనా, నేను
ఎవరు? నువ్వెవరు?
No comments:
Post a Comment