అయ్యో! ఎంత ఉలికిపాటు కన్నయ్యా నీకు
అమ్మా నే మన్ను తినలేదని చెప్పినా
మూతికంటి నువ్వు తుడుచుకోని ఆ
వెన్న వెన్నెల నిన్నలాగే పట్టిస్తుందిలే కానీ
నీ వడ్రాణం కింద వేలాడే ఆ చిన్ని బెల్లంకాయతో నిన్ను చూచి
నీ ముడ్డి కడిగి ఓ నాలుగు అక్షరాలు రాసుకున్న
ఆ మగ యశోదను నేను కూడా కానీ
ఎదిగిన రోషం తన్నుకొచ్చి కన్నయ్యా
ఎరుపెక్కిన ముఖంతో నిందారోపణలతో నాతో వాదిస్తో నన్ను సంహరిస్తో
విశ్వాన్ని చుట్టి మధించే ఆత్మను నువ్వెలాగూ
చూడటం మరిచావు కానీ, కన్నయ్యా నా ఇతర
ప్రతిబింబాల చిన్నయ్యా లాగులు ఎలాగూ లేవు
మరి ఎవరికీనూ- నీకూనూ నాకూనూ - మరిక
ఎందుకు కన్నా దొంగ చిన్నా నీకంత నీ అంత
ఉలిక్కిపడి తడుముకునే స్వగతాల
స్వీయ జాతరల పదాల ఉలికిపాటు?
No comments:
Post a Comment