లిఖిత
05 August 2012
అప్పుడు నీకు
రెండు వేళ్ళ మధ్య
వొత్తిని
అదిమి వేసి
చీకటిని వెలిగించి-
యిక ఒక్కడివే రాత్రంతా
రాళ్ళనీ వాననీ
గాలినీ చీకటినీ
విన్న క్షణాలలో
తడిమిన చేతికి
ఎవరూ అందక
పోతే
ఎలా అనిపించింది
అప్పుడు నీకు? నీ
ఏకాకి నీడకూ?
No comments:
Post a Comment
Newer Post
Older Post
Home
Subscribe to:
Post Comments (Atom)
"అనేకసార్లు పడుకుని ఉంటాను, అతనితో..."
శ్రీకాంత్ అంటూ ఎవరూ లేరు
వ్వె వ్వె వ్వే 2. (ణేనే నేణే ణెనే...)
No comments:
Post a Comment