జ్వరం సోకినఈ రాత్రుళ్ళలో
నీ నుదిటిపై చల్లటి వర్షమై
ఓ అరచేయి దీపం వెలిగించిన వెచ్చదనంతో
నీ చీకటి కళ్ళని నెమ్మదిగా ఒద్దికగా తాకితే
రేపు ఉదయం
తడిని విదుల్చుకునే రెక్కలతో
ఎగిరేపోతాయి గూళ్ళలోంచి ఆ
పక్షులు, కొద్దిగా ఉపశమించి చల్లబడిన నీ శరీరంలోంచి
మంటను రాజేసిన వంటింట్లోకి
ఓ తేనీటి పాత్రలో మరిగే ఆ సూర్యజలం వద్దకు- సరే, సరే
కృతజ్ఞతలు చెప్పుకోవాలి యిక నీకే ఎప్పటికైనా
పూలు వడలి అలసి ఆగిన చోట
నువ్వు వికసించిన కాలానికీ
ఒక అనామక పద స్నేహానికీ-!
కృతజ్ఞతలు చెప్పుకోవాలి యిక నీకే ఎప్పటికైనా
ReplyDeleteపూలు వడలి అలసి ఆగిన చోట
నువ్వు వికసించిన కాలానికీ
ఒక అనామక పద స్నేహానికీ-!
మీ కవిత చదివినప్పుడల్లా ఓ బాధ కలుగుతుంది
ReplyDeleteదేహానికి నియమిత రంద్రాలతో వెదురునౌతాను
ఇక ఒకటే ఎదురుచూపు
ఎవరైనా వచ్చి గాలినైనా వూదుతారేమోనని
నన్ను నేను పలికించుకోలేని వేణువునౌతాను