ఏ చేతులైతే చీకటిని చిదిమేందుకు
ఒక దీపాన్ని లోపలి తెస్తాయో
ఆ చేతికి చెందిన పెదాలే తిరిగి
ఉఫ్ఫ్ మంటో వంకీలు తిరిగిన గాలిని ఊది నీ
ప్రమిదె కాంతిని ఒక్క అధాటున ఆర్పివేస్తాయి-
ఇంతా చూసి యిక
చేతులకీ, పెదాలకీ
చీకటికీ వెలుతురికీ
ఏం సంబంధమంటే
నేనేమి చెప్పేదిరా అమ్మలు గన్న
నాన్నలు లేని నా ఎర్రి నాగన్నా?
No comments:
Post a Comment