నెలవంకని మోసుకుని నల్లని చీమలు
నీ నిదురలోకి నడిచే రాత్రి అయ్యింది-.
యిక చూడు
కరివేపాకు వనాలు వీచే
కిటికీలు తెరచి ఉంచిన
మన గదిలో రెండు మంచాలు పరిచాను దూరం దూరంగా. యిక
ఈ రాత్రంతా ఇరు మంచాల పైనా
ఒకే సమయంలో పరుండలేక ఓ
ఆరేళ్ళ పిల్లవాడు ఎందుకో
చీకటిలో గులాబీ నక్షత్రాల రెక్కలని విదిల్చే
ఆ నల్లని కాంతి సీతాకోకచిలుకలనే
తన తెల్లటి చేతులతో అనుసరిస్తాడు.
సరేలే. ఒక రాత్రి కూలిపోతే
పక్షులు రాలిపోతే - నీకూ
నాకూ ఏం సంబంధం? కానివ్వు ఇలాగే!
నీ నిదురలోకి నడిచే రాత్రి అయ్యింది-.
యిక చూడు
కరివేపాకు వనాలు వీచే
కిటికీలు తెరచి ఉంచిన
మన గదిలో రెండు మంచాలు పరిచాను దూరం దూరంగా. యిక
ఈ రాత్రంతా ఇరు మంచాల పైనా
ఒకే సమయంలో పరుండలేక ఓ
ఆరేళ్ళ పిల్లవాడు ఎందుకో
చీకటిలో గులాబీ నక్షత్రాల రెక్కలని విదిల్చే
ఆ నల్లని కాంతి సీతాకోకచిలుకలనే
తన తెల్లటి చేతులతో అనుసరిస్తాడు.
సరేలే. ఒక రాత్రి కూలిపోతే
పక్షులు రాలిపోతే - నీకూ
నాకూ ఏం సంబంధం? కానివ్వు ఇలాగే!
Disappointing . . .
ReplyDelete