12 August 2012

పసి నిద్ర

ఈ రాత్రి దీపపు వెన్నెల కొమ్మ కింద
నువ్వో పసి పసిడి సీతాకోకచిలుకవి-

సబ్బునీళ్ళు చాలిక నీకు
ఊదుతావు నీ పెదాలతో
రంగురంగుల ఆకాశాల్ని
దివంగత ప్రసంగాలుగా మారిన గృహ రణాల రుణాల మనుషుల ముందు-

భగవంతుడా నాక్కొంచెం
ఆ పసితనాన్ని తెచ్చివ్వు-

నిదురపోతాను నీలా
నిదురలో నవ్విన పసి పెదాలపై వీచిన
నీ విశ్వ వేణుగానపు వెదురు వనాల్లా!

No comments:

Post a Comment