అర్థరాత్రి నిద్రలోంచి లేచొచ్చి, ఆ మూడడుగుల మల్లెపూవు
నా పక్కగా వచ్చి 'నాన్నా' అంటూ
నన్ను హత్తుకుని పడుకుంది.ఇక
ఆ చీకట్లో ఒక నెగడు రగిలి, పేరులేని సుగంధమేదో
గాలిలో వీయగా, ఎక్కడో కొమ్మల్లో గూళ్ళల్లో
పక్షులు రెక్కలు సర్దుకుంటున్న చప్పుడు:
ఒక నెత్తురు గీతం. ఒక శాంతి కపోతం. చలి చిక్కగా
ధూపమై వీచే ఆ వేళల్లో ఆ గదిలో ఎక్కడ
వేలితో తాకినా వెలిగే ఒక కాంతి సంకేతం
కొంత అలజడీ, కొంత అబ్బురమూ కొంత
జీవితం పట్ల కృతజ్ఞతా, కొంత
కరుణా బోల్డంత ఇష్టమూనూ-
నిద్దురలో ఏదో కలువరించి, మెల్లిగా కదిలిన ఆ మల్లెపూల కలనీ
తెల్లగులాబీ మొగ్గలవంటి ఆ కళ్ళనీ
ఇలా చూసుకుంటూ, ఇక ఈ రాత్రి
నువ్వైనా నేనైనా ఎలా నిదురోగలం?

No comments:
Post a Comment