అతుకులుగా విరిగిన గోడ పూచింది
నీడల పూలతో మధ్యాహ్నం ఒక్కటే
గోలగోలగా అరిచే కాకితో-
(You know that I'm on the Facebook)
వరండాలో-కుర్చీలో- చలికి యెద ఎండిన దాహంతో
ఇన్ని రాళ్ళు ఏరుకుంటుందీ కాకి
ఎన్నటికైనా ఒక కుండ
దొరకక పోతుందా అని
(Are you on the Facebook? )
కానీ, మరి అప్పటిదాకా ఎన్నటికి నిండేను అద్దంలోనీ
పాత్ర, తాకలేని తాగలేనీ
శరీరపు మట్టిపాత్ర?మరి
అందుకే, ఇక్కడే కొమ్మల్లో కూర్చుని అరుస్తున్నా కావ్
కావ్ మని రికామీగా. దిక్కూ మొక్కూ లేకుండా మీతో
కానీ
సరేలే, ఇక ఇంతకంటే
ఏం చేయగలం మనం
రాళ్ళు పొదిగిన ఈ
రాత్రుళ్ళ దినాలలో?
(Have you ever been booked by a face?
Have you ever become faceless?)
ఆమెన్.

No comments:
Post a Comment