నిప్పులని మింగి అతనూ, మంచుపూలతో తనూ: ఎదురుగా
లతల వలే, వంకీలు వంకీలుగా ఇద్దరిలోంచీ
నింగికి అల్లుకుంటున్న ఎడబాటు.అదొక సర్ప
శ్వాస. అజగరపు కౌగిలి. కనులలోంచి పూలు
దగ్ధమయ్యి, చూపులు చాచినా అడుగు అంటని లోయల దారి-
ముఖాలు కపాలాల్లా, అరచేతులు కన్నీటి
బావుల్లా మారే ఒకానొక దగ్గరితనమూనూ.
మరేమిటంటే, ఎవరో కుత్తుక కింద, మెత్తగా ఒక కత్తి గాటు
పెడితే, చుక్క చుక్కగా నెత్తురు ఉబికి, మాటలు మరకలుగానూ
దీపపు వెలుతురు చుట్టూ కదిలే నల్లటి వలయం గానూ
మెసిలే నీడలు గానూ, ఆ గాలిలో, ధూళిలో, చేతివేళ్ళని
పుచ్చుకున్న చేతివేళ్లు విడిపోలేకా, అలా అని ఉండలేకా
ఇక విడివడి, ఇక తిరిగి ఎప్పటికీ ఆ గుప్పిట్లలో ఇమడలేని దిగులు
తనంతో, అతను ఆమెగా, ఆమె అతనిగా మారి ఇక
ఒకరినుంచి మరొకరు శాశ్వతంగా వీడి, వెళ్ళిపోయే
-చిగురాకులు చినుకులకు చిట్లిపోయే-ఒక అప్రతిహత వానాకాలం.
"వెళ్తాను. వెళ్ళాక ఉత్తరం రాస్తాను. వీలైతే, నేను చచ్చిపోయేలోగా
ఒక్కసారైనా నిన్ను చూడాలి నానీ. కనీ నువ్వు జాగ్రత్త." అని
తను వేకువను వీడే మంచుపొగలా కదిలితే, స్థాణువై
ఇక అతనొక్కడే అక్కడ: ఇక్కడ. ఒక శిలయై మృత్యు
పరిచయమై, శీతలమై నీటిపై వొదిలివేసిన ప్రమిదెయై-
(ఇక ఆ తరువాత ఎన్నడూ తను రాయలేదు, అతనూ ఒక
రాతయై తిరిగి రాలేదు: చీకట్లో వెలుగుతోంది ఒక తెల్లని
దీపం, అప్పటి నుంచి ఇప్పటిదాకా అక్కడే, తెల్లని వస్త్రం
కప్పిన - ఎవరో తెలియని- శిరస్సు వద్ద, సమాధుల వద్ద
స్మృతి పూలతో, దూరమై రోదనై కొనసాగే
రంపపు కోత సవ్వడై:ఇక నేనేం చెప్పను?
ఇక నేనేం రాయను?)

No comments:
Post a Comment