చీకట్లో కూర్చుని, తదేకంగా చూస్తాడు అతను, కిటికీకి అనుకుని
ఓ వారగా తల వాల్చి కూర్చున్న తన వైపూ
ఒంటరి వజ్రంలా మెరిసే తన నయనం వైపు:
అతనికి అప్పుడు కించిత్ ఆశ్చర్యం. 'ఏమైంది
తన మరో నయనం' అని. ఇక అప్పడు తను లేచి
అతని వద్దకి వచ్చి, మెత్తగా అతనిని హత్తుకున్నప్పుడు
అతని శరీరమంతా ఓ నయనమయ్యి, ఓ మొగలి పూల
పరిమళంలో ఆ రాత్రంతా, ఆ గదిలో ఆ గాలిలో రహస్య రెక్కల సవ్వడితో
ఒక కాగడావలే అప్రతిహతంగా జ్వలిస్తో-
పరిమళంలో ఆ రాత్రంతా, ఆ గదిలో ఆ గాలిలో రహస్య రెక్కల సవ్వడితో
ఒక కాగడావలే అప్రతిహతంగా జ్వలిస్తో-
No comments:
Post a Comment