చుబుకం కింద చేయి ఆన్చి, నుదిటిపై మరో చేయి ఉంచి, పార్క్ లో
గేటు నుండి తనకు ఉన్న దూరాన్ని
కొలుస్తూ అతను: ఎర్రటి ఎదురెండ-
ఆక్కడే కూర్చోవాలని ఏమీ లేదు. కాకపోతే, తరచూ తన స్పర్శతో
సారవంతమై, చెమ్మగిల్లి తన శరీరంలా మారిన ఆ బెంచీని
తను లేని రోజున వొదిలి, చెట్టు నీడన ఎదురు చూడాలంటే
కొంత కష్టం: అతనికి. అలవాటైన అతని ప్రాణానికీ.ఇంకా వర్తకం కాని
ఆ సంబంధానికీ. అందుకే, ఊరకే, అంత తొందరగా తను
రాదని తెలిసినా, అరగంట ముందే అతను: అక్కడ.ఇంకా
స్కూలు బొమ్మలు కాని పిల్లల ముందర, పిల్లలతో ఒక నీటి బాటిల్తో.
గడ్డి మెరిసే వాళ్ళ ముఖాలతో, అమ్మను చూసే ఆత్రుతతో
నీళ్ళు చిలుకరించిన తరువాత,ఆ కొద్ది సమయం గడిచాక
అతనికీ, స్కూలు దుస్తులను దుమ్ముతో కడిగిన పిల్లలకీ, ఒక గాలి.
మట్టి వాసనా, పూల పొదలు ఊగి, ఆకులు చినుకుల్లా సవ్వడి చేసే
ఇక తనే నెమ్మదిగా, అలసిన ఓ చిరునవ్వుతో
కొంగుతో, ముఖాన చెమటని తుడుచుకుంటో
లోపలి వస్తే, ఉద్యానవనమంతా కిలకిలలతో తన పాదాల చెంత ఆ
పిల్లలతో, ఆ దినాన తొలిసారిగా నిండుగా
గుండెల నిండా తేలికగా ఊపిరి తీసుకున్న
అతనితో: మరి దయగా సూర్యుడు దాగుని, మసక చీకటిని లోకాన
మెత్తగా వెదజల్లే వేళ, తన బొజ్జని గట్టిగా
చుట్టుకుంటూ ఇక అంటారు కదా పిల్లలు
అమ్మా. ఆకలే. ఇక ఇంటికి వెళ్దామే అని
కానీ, పద పద పద మరి ఇక, మరక్కడ మీకైనా నాకైనా ఏం పని?

No comments:
Post a Comment