కడు జాగ్రత్తగా దాచుకుంటావు, ఉదయం నుంచీ ఒక పూవుని
ఒక రహదారి పక్కగా ఈ నగరంలో ఒక ఆశ్చర్యంలా ఎదురుపడిన
నీకు పేరు కూడా తెలియని ఆ పూవుని. ఉంచుకుంటావు మరి
దానిని పదిలంగా, చలికి వేసుకున్న కోటు మాటున
నీ హృదయానికి దగ్గరగా, ఆప్తంగా, తనకి ఇద్దామనీ మరెన్నో
చెబుదామనీ, చెప్పుకుందామనీ. అందుకే, ఇక సాయంత్రం
ఆ ఉద్యానవనంలో రాలతాయి తన కనురెప్పలు అశ్రువులతో
అచ్చంగా గాలి లేక వడలి, నీ అరచేయి తాకగానే
కొటులోనే విడివడి రాలిపోయిన పూరేకుల వలే-

No comments:
Post a Comment