చీకట్లో ఒక దీపాన్ని వెలిగించుకుని తనూ, తనలో ఒక
మధుపాత్రని వెలిగించుకుని అతనూ - కూర్చునారు ఇద్దరూ
రాత్రికీ బల్లకీ అటూ ఇటూ. పుప్పొడి లాంటి గాలీ, గాలి లాంటి
చీకటిలో. మరి తన శరీరంపై ఆకాశంలోని చుక్కలూ, మసక
వెన్నెలానూ. నువ్వు తరచి చూడగలిగితే గూళ్ళు
కట్టుకున్న పక్షులూ కనిపిస్తాయి:
అవే, గూళ్ళు లేని, ఆ పిచ్చుకలు.
ఇక తనకి ఇప్పుడూ పెద్ద ప్రేమా లేదు
అలా అని ద్వేషమూ లేదు. ఇంతకు ముందు తను
నింపాదిగా వెలిగించిందే ఒక దీపాన్నీ
అంతే నిర్లిప్తంగా చూస్తుంది లోకాన్ని. ఇక ఒక రహస్య
హస్తంచే స్పృశించబడి అడుగుతాడు అతను:
'ఎందుకు ప్రేమించవు, నువ్వు నన్ను?
మునుపటిలా ఉండటం లేదు నువ్వు'
కనిపించీ కనిపించని ఒక సన్నటి నవ్వు తన పెదాలపై-
అదే, కిటికీలోంచి వీచే చల్లటి రాత్రికీ గాలికీ
కుంచించుకుపోయే సన్నటి నిప్పు నవ్వు
దిగులు కలిగి దిగులైన ఒక దిగులు నవ్వు.
అందుకే ఇక చివాలున లేచిన తన కదలికలకి, తడబడి
ఆరిపోతుంది దీపం. ఇక గదిలో అతనొక్కడే, దీపాన్ని
వొదిలి వెళ్ళిపోయే పొగతో, రాత్రితో
ఆ రాతి రాత్రిలో దీపారాహిత్యంతో-

No comments:
Post a Comment