రాత్రి అన్నం వాసన వేస్తావు నువ్వు.
అందుకే, పూలను వెలిగించి
ఆకాశం కింద, అరచేతులైన
విస్త్రరాకుతో కూర్చుంటాను నేను, ఒక వెన్నెల ప్రమిదెని వెలిగించుకుని.
చీకటినో, చుక్కలనో వొంపు
ఈ మృణ్మయ పాత్రలోకి నా
నవపారిజాతాల దేహంలోకి.
నిదురోతాను, ఆది అంతాల- అనంతాల- దిగంబరుడైన ప్రభువునై, బానిసనై-

No comments:
Post a Comment