పొరలు, పొరలుగా - చెక్కులు చెక్కులుగా
అంతే నింపాదిగా అంతే ఓపికగా, నుదుటన
వాలిన శిరోజాలను వెనక్కి తోసుకుని తిరిగి
మళ్ళా
పొరలు, పొరలుగా - చెక్కులు చెక్కులుగా
నీ హృదయాన్ని తవ్వుతారు ఎవరో, ఒక పారతో.
ఇక నీకూ తెలియదు, వారికీ తెలియదు
తవ్విన భూమిలో, ఒక విత్తనమే నాటతారో
ఒక పూల మొక్కనే ఉంచుతారో , లేక
నిన్నే పూడ్చి మట్టిని కప్పి వెళ్లిపోతారో.
'ఉన్నావా, లేవా? ఇంతకూ ఎలా ఉన్నావు?' అని
మళ్ళా వాళ్ళే అడిగితే
అపుడే ఎలా చెప్పడం?
మళ్ళా వాళ్ళే అడిగితే
అపుడే ఎలా చెప్పడం?
No comments:
Post a Comment