నిన్ను చదువుదామని అనుకుంటాను. ఎలాగో ఒలాగా. మరి
ఇక్కడా ఏమీ లేదు: మరి కాంతికి ఊరికినే కదులుతాయి
నువ్వు వేలాడదీసిన గాజు పక్షులు పరావర్తనమై గోడలపై
నీడలై.
'నీడలే మిగిలేవి చివరికి' అని నేను అంటాను.
అరచేతుల్లో ఏమీ మిగుల్చుకోని మనిషి అనే మాటలనే
కాగితాలని తూనిగల వలె చుట్టి, మరి నీ కనుల ఇసుక
మైదానాలపై ఎగురవేస్తో, అరచేతుల్లో
ఏమీ మిగుల్చుకోలేని ఓ మనిషి అనే
చిన్ని చిన్ని మాటలనే, నేను గూళ్ళలోంచి తవ్వి పోస్తాను.
తెలుసు. నేనొక నిస్సహాయుడనని. పదాలనే హత్తుకుని
ఆఖరి నెత్తురు చుక్క వరకూ నీ వద్దకు పారాడే ఒక శర
నార్ధిననీ, మరి ఒక అర్థ/నారీశ్వరుడననీ
నేలనెలవంకను పిచ్చిగా ఇష్టపడే
ఒక మామూలు, వాన చుక్కననీ
అవి ఏ కనులలో నుంచైనా కురిస్తే
తట్టుకోలేని బాలకుడనని, సదా సంచారిననీ ద్రిమ్మరిననీ.
అందుకే
నిన్ను చదువుదామని అనుకుని, రాత్రిని ఒక మంట చేసి
వెలిగిస్తే, శరీరం అంటుకుని కాలుతుంది తెల్లటి పరదాలలో
నిన్నిక
చదవద్దో చదవద్దో అంటో, నీడల్ని ఆర్పే వేకువ కాంతై
వేకువ కాంతిని ఆర్పే పొగ మంచై, చల్లగా చల్లగా ఇక
నుదిటిపై అరచేయంత చల్లని తల్లి దీవెన లాగా, ఇలాగ.

No comments:
Post a Comment