02 January 2013

ఎక్కడ ఉన్నావు నువ్వు

ఒక్కోసారి చేయడానికి ఏమీ ఉండదు. అందుకని

ఉట్టినే, అలా చేయి పుచ్చుకుని కూర్చుంటావు
మసక చీకట్లో, గాలిలో
వీచే చెట్లల్లో మంచులో

ఆకాశంలో మెరిసే ఒక నక్షత్రాన్ని చూస్తూ: నిజమే
నువ్వు చెప్పినట్టు
ఏమీ ఆశించకుండా

ఉట్టినే, అలా ఒకరిని ఆనుకుని మరొకరు కూర్చుని
అరచేతులు పుచ్చుకుని
ఇద్దరినీ నింపే నిశ్శబ్ధంతో
ఒక పురుగు వాలిన ఆకు

తేలికగా అలా వొంగిన బరువుతో
రాబోయే రాత్రిని వినడం, కనడం
బావుంటుంది: కానీ

ఇంతకు ఎక్కడ ఉన్నావు నువ్వు

నరుక్కు వెళ్ళిన
నా మరో చేతితో
ఇక్కడ నన్ను ఏకహస్త, ఎడారివాసినీ దాహార్తినీ చేసి? 

No comments:

Post a Comment