"దేశం, దేహం, ద్రోహం
నీకీ పదాలు తెలుసు
నా?" అని తను అడిగింది (ఎందుకో నాకు తెలియదు)
"this body" ( చూపుడు
వేలితో తన శరీరాన్ని
చూపిస్తూ)
"is a site of exploitation
ఇదొక మగవాళ్ళ సాంసృతిక యుద్ధ రంగమని
ఇదొక విపణి వీధి అనీ
నిర్వచనాల నిశీధి అనీ తెలీయదా నీకు?
దేశం దిగివచ్చి, దేహంపై రాజ్యమై
ఒక చట్టమై ఒక ముద్రికగా మారు
తుందని తెలియదా నీకు? నీ
వాచకాలు ముద్రించేందుకూ
నీ దేశాన్నీ, నీ మతాన్నీ భద్ర
పరిచేందుకూ, కొననసాగించేందుకూ, ఈ దేహం
ఒక పరిశోధనాలయం అవుతుందనీ
ఇదంతా దేవుళ్ళ దేవతల పురాణాల
నిలయమనీ, తెలియదా నీకూ?"
అని మళ్ళా అంది తను
తల వంచుకున్న నా
కళ్ళను పైకి లేపి- " How do you know
that this is my body?
How do you know
That there is a body beyond your inscription?
First of all
How do you know that there is a body?" అని
పిచ్చిగా తుళ్ళి తుళ్ళి నవ్వింది
తను, కనుల వెంట
నీళ్ళు చిప్పిల్లేదాకా-
"మూర్ఖుడా. నిన్ను నువ్వు తెలుసుకునే ముందు
ముందుగా, నీ దేహాన్ని తెలుసుకో" అంటో తనే
"Know your body, before you know yourself
Know your body to be nobody"
అని అంటే ఇక నేను కూలబడ్డాను
ఈ తెల్లని తెరల ముందు
ఈ నల్లని పదాలని రాస్తో
అంతిమంగా మీకీ కింది వాక్యాన్ని అనుమతిగా ఇస్తో-
Don't you know that
Words do have sex
And that language is sexed, and that don't you know that
గూళ్ళు కట్టుకుని భద్రంగా ఉన్న
పక్షులేవీ ఇక్కడ మిగిలి లేవనీ?
నీకీ పదాలు తెలుసు
నా?" అని తను అడిగింది (ఎందుకో నాకు తెలియదు)
"this body" ( చూపుడు
వేలితో తన శరీరాన్ని
చూపిస్తూ)
"is a site of exploitation
ఇదొక మగవాళ్ళ సాంసృతిక యుద్ధ రంగమని
ఇదొక విపణి వీధి అనీ
నిర్వచనాల నిశీధి అనీ తెలీయదా నీకు?
దేశం దిగివచ్చి, దేహంపై రాజ్యమై
ఒక చట్టమై ఒక ముద్రికగా మారు
తుందని తెలియదా నీకు? నీ
వాచకాలు ముద్రించేందుకూ
నీ దేశాన్నీ, నీ మతాన్నీ భద్ర
పరిచేందుకూ, కొననసాగించేందుకూ, ఈ దేహం
ఒక పరిశోధనాలయం అవుతుందనీ
ఇదంతా దేవుళ్ళ దేవతల పురాణాల
నిలయమనీ, తెలియదా నీకూ?"
అని మళ్ళా అంది తను
తల వంచుకున్న నా
కళ్ళను పైకి లేపి- " How do you know
that this is my body?
How do you know
That there is a body beyond your inscription?
First of all
How do you know that there is a body?" అని
పిచ్చిగా తుళ్ళి తుళ్ళి నవ్వింది
తను, కనుల వెంట
నీళ్ళు చిప్పిల్లేదాకా-
"మూర్ఖుడా. నిన్ను నువ్వు తెలుసుకునే ముందు
ముందుగా, నీ దేహాన్ని తెలుసుకో" అంటో తనే
"Know your body, before you know yourself
Know your body to be nobody"
అని అంటే ఇక నేను కూలబడ్డాను
ఈ తెల్లని తెరల ముందు
ఈ నల్లని పదాలని రాస్తో
అంతిమంగా మీకీ కింది వాక్యాన్ని అనుమతిగా ఇస్తో-
Don't you know that
Words do have sex
And that language is sexed, and that don't you know that
గూళ్ళు కట్టుకుని భద్రంగా ఉన్న
పక్షులేవీ ఇక్కడ మిగిలి లేవనీ?
No comments:
Post a Comment