"ఎప్పుడూ ప్రేమ గురించి మాట్లాడతావు నువ్వు, హృదయం గురించీనూ-
మహాపిరికితనం నీకు, శరీరం గురించీ
శరీర దాహం గురించీ మాట్లాడేందుకు
ఇదిగో ఈ నెత్తుటి మరక గురించి చెప్పావా ఎన్నడైనా, నువ్వైనా నీ తోటి
కవులైనా? అయినా విసుగు వేయడం లేదు మీకు? వెన్నెలతో, పూలతో?"
అని నిబ్బరంగా యోనిని చూపిస్తో, యోని గాయాలని చూపిస్తో గట్టిగా
నవ్వింది తను, చెట్లు వీచేలా ఆకాశం వొణికేలా, నా కళ్ళు నీళ్లై రాలేలా
ఆ ఆదిమ తల్లీ, నా గ్రామ దేవతా, గోడలపై వెలసిపోయిన
తలుపులమ్మ తల్లీ, నిరాకార రూపాల నిర్వాసిత తండ్లాటై
అప్పటికి నాలుగు గర్భస్రావాల శోకమై
నను గాట్టిగా కౌగలించుకుని, నేను భయపడేటట్టు పిచ్చిగా నవ్వుతో.
ఇక నేను పరిగెత్తీ పరిగెత్తీ పరిగెత్తీ
అనాత్మనై శాంతికై పదాలకై నలు
దిక్కులా వెదికీ వెదికీ వేసారీ ఇలా
రెండు అరచేతుల మధ్య నా తలను పాతుకుంటో, వొత్తుకుంటో ఇక
పాపపరిహారం లేని పురుష పదాలతో
గర్భసంచిని కోల్పోయిన, తన గర్భం
వద్దే కూలబడ్డాను, ఈ లోక వైద్యుడు దొంగ నంగి ప్రతీకల మాటలతో
తవ్వి వేయబడ్డ నా తల్లివి కదా నువ్వు
అనుకుంటూ: చూసారా మీరు ఇంతకూ
ఆ కన్నమ్మను, మీ ఇళ్ళల్లో మీ అమ్మల్లో మీ చెల్లెళ్ళలో మీ భార్యల్లో
మీ ప్రియురాళ్ళలో మీ కూతుళ్ళలో ఏమీ
లేక వెళ్ళిపోయిన అనేకానేక స్త్రీలల్లో ఇల్లా?

No comments:
Post a Comment