తమలపాకులై సాగిన నీ అరచేతుల్లో
పచ్చి వక్కై వొదుగుతాడు ఫిరోజ్-
అత్యంత సరళత్వంతో, తెల్లటి నీ కళ్ళని
రాసిన ఆ ఆకులను
వేళ్ళ మధ్య ముడిచి
నింపాదిగా నీ పెదాల వద్దకు
తీసుకుంటావు: ఫరీదా, ఇక
నెత్తురు తుళ్ళిన అతని శరీరాన్ని
నీ హృదయంలో, నీ నిర్లక్ష్యంతో
నమిలి వేయబడటమే బాకీ-
మరి
చూసుకున్నావా నువ్వు ఇంతకూ
రాత్రిలో ఎర్రగా పండిన, నీ నాలికని
రహదారి పక్కగా నువ్వు ఊసేసాక
మధుశాలల్లో
చందమామై
మెరిసిపోయిన అతనినీ? ఫిరోజ్నీ?
పచ్చి వక్కై వొదుగుతాడు ఫిరోజ్-
అత్యంత సరళత్వంతో, తెల్లటి నీ కళ్ళని
రాసిన ఆ ఆకులను
వేళ్ళ మధ్య ముడిచి
నింపాదిగా నీ పెదాల వద్దకు
తీసుకుంటావు: ఫరీదా, ఇక
నెత్తురు తుళ్ళిన అతని శరీరాన్ని
నీ హృదయంలో, నీ నిర్లక్ష్యంతో
నమిలి వేయబడటమే బాకీ-
మరి
చూసుకున్నావా నువ్వు ఇంతకూ
రాత్రిలో ఎర్రగా పండిన, నీ నాలికని
రహదారి పక్కగా నువ్వు ఊసేసాక
మధుశాలల్లో
చందమామై
మెరిసిపోయిన అతనినీ? ఫిరోజ్నీ?
No comments:
Post a Comment