దేహధారి వైనందుకు దేహం దొరకదు
పాత్రధారివైనందుకు ముఖం దొరకదు
ఈ దినాలూ ఆ దినాలూ ఆలుపు లేక తిరిగినా స్నేహ వాంఛవైనందుకు
ఒక స్నేహితుడు దొరకడు
మృత్యువు వరకు సాగినా
ప్రాణధారి వైనందుకు
ఒక ఆ పదం దొరకదు-
నలుమూలలా నిన్ను వెదికి గాలించి శోధింఛి, నిన్ను శుభ్రపరిచే ఒక
మహిమాన్విత స్త్రీ దొరకదు
ఇక కడవరకూ ఛాయ లేని గోడలపై ఈ నీడలే, పక్షులు వొదిలివేసిన
గూళ్ళే, వడలిపోయిన సంధ్యలే.
ఇక మిగిలింది అంతా బ్రాంతి బ్రాంతి, బ్రాంతి- ఈ శాంతి.
తప్పుకో ఇక్కడ నుంచి. రాలిన పూలను ఏరుకుంటున్నాను.

No comments:
Post a Comment