కొన్నిసార్లు నీ ముఖం ఏమిటంటే
వేళ్ళ చివర్లన వేలాడే ఒక చిన్న అమృత పాత్ర. మరి
కొన్నిసార్లు నీ ముఖం ఏమిటంటే
అరచేతుల్లో పొదివిపుచ్చుకున్న, ఎగరలేని ఒక బుజ్జి పావురం పిల్ల. ఇంకా
కొన్నిసార్లు నీ ముఖం ఏమిటంటే
ముంజేతిపై అలసటగా వాలిన, మసక చీకట్ల పొగ కమ్మిన నుదురు. మరి
ఇక వెలగలేక ఆరిపోయిన ఒక దీపమూ
నిస్సత్తువుగా బోర్లించిన రెండు మృణ్మయ
పాత్రలూ, ఎక్కడో తచ్చట్లాడే కనులూనూ.
స్నానాల గదిలో అద్దంపై అంటించిన ఒక ఎర్రటి చమట బిందువు కూడానూ
నెమ్మదిగా తీసి దిండు కింద ఉంచిన, నేను
ఎప్పుడూ కొనివ్వని, నీ తల్లి నీకు కొనిచ్చిన
నలిగిన ఆ ఆకుపచ్చ మట్టి గాజులూనూ.సరే
ప్రేమంటే ఏమిటో నాకు తెలియదు. నేను నీకు
చెప్పానా ఎన్నడైనా నిన్ను నేను
తెలియకుండా ప్రేమిస్తున్నానని?
No comments:
Post a Comment