చీకట్లో మెరిసే రెండు ఆకుపచ్చని ఆకులు
నీ కళ్ళు
ఇక
వేళ్ళతో రాస్తాను వాన చినుకులని చిగురాకులపై
వెన్నెల
శ్వేత సీతాకోకచిలుకలై మన చుట్టూ ఎగిరే వేళల్లో
మరి
చీకటి కాటుకని కొసవేళ్ళతో రాసుకున్న నీ చేతిని
ఇలా
ఇవ్వు
ఇక
రాసుకుంటాను ఈ అక్షరాలను
నింగి నిదురంటిన
నా
రెండు ఆకుపచ్చని కలలపై- గడప/లేని రాత్రినై.

బాగుందండీ కవిత!
ReplyDelete