"నీ చీకటిని ఏ దీపమూ వెలిగించలేదు
నీ చేతులే, తలను పాతుకున్న నీ చేతులే
నువ్వు తల ఎత్తలేని కర్మాగారాలు.
శరీరమంతైన కళ్ళల్లో, ఆకాశాన్ని తాకేంత
చీకటి గోడలూ, పొగలూ ఆకులు
ఒరుసుకుని నీడల్లా కదిలే నీలి శబ్ధాలు-
మెడపై కాడిని దించి కొద్దిగా ఇటు చూడు
నీ ఎదురుగా నేను, కొంత మసక
వెన్నెల వలె, మరి కొంత
ఉదయం వండి, నీకై దాచిన అన్నం
వలే, నెత్తురు చిప్పిల్లిన నీ పెదాలకి
అందించిన మంచి నీళ్ళ వలే - ఒక పాక వలే-
దా. నన్ను కావలించుకో. నిర్భీతిగా
తేలికయ్యేదాకా వెక్కి వెక్కి ఏడ్చుకో
నీ తల్లిని కూడా కదా నేను-" అని అంది తను తనువుతో:
ఉగ్గబట్టుకున్న అతను ఇక జలజలా
రాలిపడి, తన కన్నీటితో ఆమె దేహ
దీపాన్ని వెలిగించాడు, అవిసె చెట్లు
హోరున వీచే గాలుల్లో ఆ రాత్రంతా
వెలిగిన నిదుర గుడిసెలో: ఇక అది
'ఏమిటి' అని అడిగేందుకు నేనెవరు మీరు ఎవరు?
నీ చేతులే, తలను పాతుకున్న నీ చేతులే
నువ్వు తల ఎత్తలేని కర్మాగారాలు.
శరీరమంతైన కళ్ళల్లో, ఆకాశాన్ని తాకేంత
చీకటి గోడలూ, పొగలూ ఆకులు
ఒరుసుకుని నీడల్లా కదిలే నీలి శబ్ధాలు-
మెడపై కాడిని దించి కొద్దిగా ఇటు చూడు
నీ ఎదురుగా నేను, కొంత మసక
వెన్నెల వలె, మరి కొంత
ఉదయం వండి, నీకై దాచిన అన్నం
వలే, నెత్తురు చిప్పిల్లిన నీ పెదాలకి
అందించిన మంచి నీళ్ళ వలే - ఒక పాక వలే-
దా. నన్ను కావలించుకో. నిర్భీతిగా
తేలికయ్యేదాకా వెక్కి వెక్కి ఏడ్చుకో
నీ తల్లిని కూడా కదా నేను-" అని అంది తను తనువుతో:
ఉగ్గబట్టుకున్న అతను ఇక జలజలా
రాలిపడి, తన కన్నీటితో ఆమె దేహ
దీపాన్ని వెలిగించాడు, అవిసె చెట్లు
హోరున వీచే గాలుల్లో ఆ రాత్రంతా
వెలిగిన నిదుర గుడిసెలో: ఇక అది
'ఏమిటి' అని అడిగేందుకు నేనెవరు మీరు ఎవరు?
No comments:
Post a Comment