03 January 2013

అప్పుడు

గోచీ ఎగలాగుకుని, కాలవ గట్టున కూర్చుని
నీళ్ళల్లో చందమామని
కాళ్ళతో కెలుకుతుంటే

వెల్లకిల్లా పడుకుని, ఒక అరచేయి తల కిందా
మరోకటితో బీడిని ఊదుతూ

"అరే నా బట్టా, చందమామ
జున్ను ముక్కలా ఉంది
ఎన్నేలేమో కల్లులా. ఈ

యేళ, చేతిలో కాల్చిన ఎండు చేపా, నోటికింత
మందూ ఉంటే ఎంత బావుండు"

అని అన్నాడు, నా జోర్భా
ఆ రాత్రి ఊరవతల తాడి
చెట్లు తళతళలలో, పచ్చిక మత్తుగా ఊగే వేళల్లో.

ఇక చెప్పా పెట్టకుండా
తటాలున కాలువలోకి దూకాం

ఆ కప్పా నేనూ
అప్పటిదాకా మాలో చల్లగా దాగిన మూనూ! 

2 comments: