గోరువెచ్చని పసి చేతివేళ్ళు నీ నిదురవి
నేను అటువైపు తిరిగి పడుకున్నా
మరి మలుపుకుంటాయి నీ వైపు.
కలవరిస్తాయి ఏవో అవి, మరి
విప్పర్చుతాయి నీ కళ్ళ కింద
కలల తామర పూలనూ, నిదుర రంగులనూ-
గోరువెచ్చని, తల్లి స్థన్యాలు నీ నిదురవి.
చూడు ఇక.
కనులు మూసుకుని అలా నిశ్చింతగా
నిదురోతున్న నీ ఒడిలో
కనులు విప్పార్చుకుని
-పాలు తాగి- రాత్రంతా ఎలా కేరింతలుతో
ఆడుకుంటానో నేను.
నేను అటువైపు తిరిగి పడుకున్నా
మరి మలుపుకుంటాయి నీ వైపు.
కలవరిస్తాయి ఏవో అవి, మరి
విప్పర్చుతాయి నీ కళ్ళ కింద
కలల తామర పూలనూ, నిదుర రంగులనూ-
గోరువెచ్చని, తల్లి స్థన్యాలు నీ నిదురవి.
చూడు ఇక.
కనులు మూసుకుని అలా నిశ్చింతగా
నిదురోతున్న నీ ఒడిలో
కనులు విప్పార్చుకుని
-పాలు తాగి- రాత్రంతా ఎలా కేరింతలుతో
ఆడుకుంటానో నేను.
No comments:
Post a Comment