గోచీ ఎగలాగుకుని, ఆ కాలవ గట్టున కూర్చుని
నీళ్ళల్లో చందమామని
కాళ్ళతో కెలుకుతుంటే
వెల్లకిల్లా పడుకుని, ఒక అరచేయి తల కిందా
మరోక చేతితో బీడిని ఊదుతూ
"బట్టలు వేసుకున్న ఒరే నా బట్టా, ఇలా రా
చందమామ జున్నుముక్కలా ఉంది
ఎన్నేలేమో కల్లులా. ఈయేళ చేతిలో
కాల్చిన ఎండు చేపా, నోటికింత
మందూ ఉంటే ఎంత బావుండు"
అని అంది, తిరనాళ్లలో పిచ్చిగా ఎగిరే నా నాయికా
అపర మహంకాళీ, అప్పటికి
ఆరు పాకెట్లు సారా తగిన ఆ
ఒంటిపై, నెత్తురు కోతలూ కన్నీటి మరకలూ తప్ప
జానెడు గుడ్డా గుప్పెడు గూడూ
అరచే నోరంత మెతులుకూ లేని
అ లేతకళ్ళ నీటిముళ్ళ చిన్నారి
ఆ రాత్రి ఊరవతల ఆ తాడిచెట్లు
తళతళలలో, పచ్చిక గమత్తుగా
పూనకమై ఊగే వేళల్లో.ఇక
ఏమీ చేయలేక, ఏడుపునీ, కన్నీళ్ళనీ ఉగ్గపట్టుకుని
దూకాం చితికిన మా కడుపులతో
డోక్కుపోయిన, తన కడుపులోకే
అర్చుకుపోయిన తన పేగులలోకే
ఇక నేనూ రాత్రి మేనూ కాలిన వెన్నెలమై, రాలిన కళ్ళమై-
నీళ్ళల్లో చందమామని
కాళ్ళతో కెలుకుతుంటే
వెల్లకిల్లా పడుకుని, ఒక అరచేయి తల కిందా
మరోక చేతితో బీడిని ఊదుతూ
"బట్టలు వేసుకున్న ఒరే నా బట్టా, ఇలా రా
చందమామ జున్నుముక్కలా ఉంది
ఎన్నేలేమో కల్లులా. ఈయేళ చేతిలో
కాల్చిన ఎండు చేపా, నోటికింత
మందూ ఉంటే ఎంత బావుండు"
అని అంది, తిరనాళ్లలో పిచ్చిగా ఎగిరే నా నాయికా
అపర మహంకాళీ, అప్పటికి
ఆరు పాకెట్లు సారా తగిన ఆ
ఒంటిపై, నెత్తురు కోతలూ కన్నీటి మరకలూ తప్ప
జానెడు గుడ్డా గుప్పెడు గూడూ
అరచే నోరంత మెతులుకూ లేని
అ లేతకళ్ళ నీటిముళ్ళ చిన్నారి
ఆ రాత్రి ఊరవతల ఆ తాడిచెట్లు
తళతళలలో, పచ్చిక గమత్తుగా
పూనకమై ఊగే వేళల్లో.ఇక
ఏమీ చేయలేక, ఏడుపునీ, కన్నీళ్ళనీ ఉగ్గపట్టుకుని
దూకాం చితికిన మా కడుపులతో
డోక్కుపోయిన, తన కడుపులోకే
అర్చుకుపోయిన తన పేగులలోకే
ఇక నేనూ రాత్రి మేనూ కాలిన వెన్నెలమై, రాలిన కళ్ళమై-
No comments:
Post a Comment