వెంటాడుతావు ఎందుకో
తన వెనుకే, తన తనువు వెనుకే వెను వెనుకనే
తననే, తన ఆ తనువునే
వేణువులా ఊదుదామనీ
తన సరస్సులో చేపపిల్లవై ఈదులాడుదామనీ
వెడుతుంటావు వెనుకే, వెను వెనుకనే
ఊరికనో, కోరికతోనో
ఆటతోనో అల్లరితోనో
నిన్ను నువ్వు కనుక్కుందామనే
అనుసరిస్తావు
మొహంతోనో, మైకంతోనో
ఒక అమృత దాహంతోనో
ప్రేమ విషంతోనో-
ఏడు లోకాలు తిరిగి
ఏడు కాలాలు దాటి
తిరిగి నువ్వొకడివే
తను లేక, తనువు ఎప్పటికీ లేక
తిరిగి నువ్వొకడివే
నువ్వు చూడని కనులనుంచి
రాలే పన్నీరు కరుణలో
తడిచి తడిచి, ఏడ్చి ఏడ్చి
తిరిగి నువ్వొకడివే
ఒంటరిగా
ఒంటరిగా
ఒంటరిగా
ఆఖరుగా-
తన వెనుకే, తన తనువు వెనుకే వెను వెనుకనే
తననే, తన ఆ తనువునే
వేణువులా ఊదుదామనీ
తన సరస్సులో చేపపిల్లవై ఈదులాడుదామనీ
వెడుతుంటావు వెనుకే, వెను వెనుకనే
ఊరికనో, కోరికతోనో
ఆటతోనో అల్లరితోనో
నిన్ను నువ్వు కనుక్కుందామనే
అనుసరిస్తావు
మొహంతోనో, మైకంతోనో
ఒక అమృత దాహంతోనో
ప్రేమ విషంతోనో-
ఏడు లోకాలు తిరిగి
ఏడు కాలాలు దాటి
తిరిగి నువ్వొకడివే
తను లేక, తనువు ఎప్పటికీ లేక
తిరిగి నువ్వొకడివే
నువ్వు చూడని కనులనుంచి
రాలే పన్నీరు కరుణలో
తడిచి తడిచి, ఏడ్చి ఏడ్చి
తిరిగి నువ్వొకడివే
ఒంటరిగా
ఒంటరిగా
ఒంటరిగా
ఆఖరుగా-
అవును...నేనొక్కడనే....
ReplyDelete