10 March 2012

ఇంతకూ

నిన్ను తలుచుకుని
నిన్న రాత్రంతా తాగాను

పగలు గుండె లేనిదై నా వెంటపడగా
ఏమీ లేని, ఏమీ రాని ఈ కాలంలోకి

కబోధినై తడుముకుంటూ కదిలాను.

ఇంతా చేసి స్నేహితుడా

నువ్వు ఉన్నావా అని
ఈ లోకంలో చూడలేదు
ఈ మతి లేని జనాన్నీ అడగలేదు.

ఇంతకూ ఉన్నావా నువ్వు?

2 comments:

  1. పగలు గుండె లేనిదై...
    బాగుంది

    ReplyDelete
  2. వున్నాను...ఇక్కడే...!

    ReplyDelete