అద్దె ఇంటి నిండా నువ్వు వెలిగించిన
అగరొత్తి పరిమళం
మరొక ఉదయం. మరొక పనిదినం
తెరిచి ఉంచిన కిటికీలు
రాలే కాంతి చినుకులు
హాయిగా తేలికగా ఊగే పరదాలు
బాల్కనీలో గింజలకై పిచ్చుకలు
నీ చుట్టూతా చిన్నచిన్న పిల్లలు
పిల్లల చుట్టూతా ఇంకా వీడిపోని
లేత నిదుర మబ్బులు: దీవెనలు
అదే ఇంటి నిండా
నువ్వు వెలిగించిన
ఉదయపు వాన పరిమళం
నిత్య జీవన ఇంద్రజాలం
ఒక మెత్తని అనుదిన కలకలం
యిక ఈ రోజుకు
ఈ నగర రహదారులలో
నేను ఒంటరిని కాను-
చాలా బాగుంది
ReplyDeletesimple and gud
ReplyDeleteఒక్కోసారి చిన్ని ఆలోచనలు ఎంత బాగా వస్తాయో ...బాగుంది
ReplyDelete