అడగకు వీధులను
బాహువులై ఆలింగనం చేసుకొమ్మని
అడగకు మిత్రులను
చీలిన హృదయంలో నిదురించమని
అడగకు స్త్రీలను
శరీరాన్ని శిశువు వలె పొదివి పుచ్చుకొమ్మని
అడగకు నిన్ను
నీకు నీవు ఆలంబనగా ఉండమని, రక్షించమని
అడగకు ఎవరినీ
నల్లటి మట్టి వలె తమలోకి తీసుకోమ్మనీ
ఒక శాంతి సమాధి కమ్మనీ
నీకు నీవే ఒక బిక్షపాత్ర, అక్షయపాత్ర
నీకు నీవే ఒక మధుపాత్ర
శరనార్ధివై తిరిగే నీవు
అడగకు ఒక మాతృ దేశాన్ని ఇమ్మనీ
ఇతరులని ఒక తల్లి చూచుకం కమ్మనీ
శ్వాసల పాలిమ్మనీ-
మృత్యు గులాబీల తోటలో
సంచరించే తుమ్మెద నీవనీ
విశ్వపు గాలిలో కొట్టుకుపోయే
గడ్డిపరకవనీ, కాంతి వానవనీ
అదే నీవనీ తెలుసు నీకు-
ఇక అడగకు ఎవరినీ, ఎప్పుడూ
నీతోపాటు రోదించమని
నీతోపాటు నవ్వమనీ, లోకాన్ని వెక్కిరించమనీ
అర్థాలని అనర్ధం కమ్మనీ:
ఒక విషపాత్రతో
ఒంటరిగా కూర్చుని, నింపాదిగా
చనిపోమ్మనీ, అనకు
ఎవరితో, రమ్మనకు
ఎవరినీ పొమ్మనకు
ఇదిగో నాకు నేనే
సమర్పించుకుంటున్నాను
ఒక తపించే పూలగుత్తిని
నా మరణానికై
నా జీవన శిధిల సమాధికై-
వింటున్నావా నువ్వు?
ఈ పదాల నిశ్శబ్దాన్ని?
బాహువులై ఆలింగనం చేసుకొమ్మని
అడగకు మిత్రులను
చీలిన హృదయంలో నిదురించమని
అడగకు స్త్రీలను
శరీరాన్ని శిశువు వలె పొదివి పుచ్చుకొమ్మని
అడగకు నిన్ను
నీకు నీవు ఆలంబనగా ఉండమని, రక్షించమని
అడగకు ఎవరినీ
నల్లటి మట్టి వలె తమలోకి తీసుకోమ్మనీ
ఒక శాంతి సమాధి కమ్మనీ
నీకు నీవే ఒక బిక్షపాత్ర, అక్షయపాత్ర
నీకు నీవే ఒక మధుపాత్ర
శరనార్ధివై తిరిగే నీవు
అడగకు ఒక మాతృ దేశాన్ని ఇమ్మనీ
ఇతరులని ఒక తల్లి చూచుకం కమ్మనీ
శ్వాసల పాలిమ్మనీ-
మృత్యు గులాబీల తోటలో
సంచరించే తుమ్మెద నీవనీ
విశ్వపు గాలిలో కొట్టుకుపోయే
గడ్డిపరకవనీ, కాంతి వానవనీ
అదే నీవనీ తెలుసు నీకు-
ఇక అడగకు ఎవరినీ, ఎప్పుడూ
నీతోపాటు రోదించమని
నీతోపాటు నవ్వమనీ, లోకాన్ని వెక్కిరించమనీ
అర్థాలని అనర్ధం కమ్మనీ:
ఒక విషపాత్రతో
ఒంటరిగా కూర్చుని, నింపాదిగా
చనిపోమ్మనీ, అనకు
ఎవరితో, రమ్మనకు
ఎవరినీ పొమ్మనకు
ఇదిగో నాకు నేనే
సమర్పించుకుంటున్నాను
ఒక తపించే పూలగుత్తిని
నా మరణానికై
నా జీవన శిధిల సమాధికై-
వింటున్నావా నువ్వు?
ఈ పదాల నిశ్శబ్దాన్ని?
బైరాగిలా...తిరుగుతూ....నీ పదాల నిశబ్దాన్ని వింటున్నాను....
ReplyDeletenijame. kaanee adagakundaa vundalem. antha dheerulamu kaakapothimi. ade vishaadam
ReplyDelete