ఒక్కడినే వెళ్లాను ఈ వేళ
ఒక మధుశాలకి
మరుపే లేని ఆ ప్రదేశానికీ
కూర్చున్నాను ఒక్కడినే
ఓ మూలగా, ఒంటరిగా
తడిచిన ఆ మసక చీకట్లలో, ఆకులు రాలే కాలంలో-
సీసా నిండుగా బ్రాందీ
పాత్ర నిండుగా బ్రాంతీ
ఈ రోజు లేవు నీవు ఇక్కడ
కానీ నీ హాంగ్ ఓవరే వ్యాపిస్తోంది నలుమూలలా
ఆ పాకుడు రాళ్ళ పచ్చి పరిమళంతో
నేల రాలి దొర్లిపోయే
నిరుడు పూల శబ్దాలతో-
ఇక నేను నీకు ప్రత్యేకంగా చెప్పాలా
ఈ వేళ నేను
నీ జ్ఞాపకంతో
తాగి తాగి మత్తిల్లి
అలసి సోలి సోలి
తూగి తూగి ఊగీ
నాకు మాత్రమే కనపడే
నీ రూపంతో, నీ నీడలతో
నగ్నంగా
నృత్యం చేస్తానని?
దేవతా గీతాలు
పాడతాననీ?
అద్భుతమిన కవిత...! LIKED IT....
ReplyDeleteనాకు మాత్రమే కనపడే
ReplyDeleteనీ రూపంతో, నీ నీడలతో
ee kavithalatho.......
ee kavithalalo.
nice