09 October 2011

నీ శరీరం

నువ్వు వస్తావు నీ శరీరం రాదు

పదాలు సాగినంత దూరం
సాగుతుంది జ్ఞానద్రోహం:

నువ్వు లేని శరీరంతో నేను
శరీరంలేని నాతో నువ్వు: వాక్యాలు
ఎదిగే వాక్యాలు
పొదిగే వాక్యాలు

సర్ప సంభరాలు. విష విజ్ఞాన
భవిత భాండాగారాలు. వస్తోంది

ఆకాశమంత ఆవులింత. తప్పుకో

పడుకుందాం కాసేపు.

(చేతుల్ని కుట్టిన చేతుల
శయన నయనా కారాగారం
ఉందిక నీకోసం. నిద్రించు.
పరమపదించు. నిన్నిక

ఎప్పటికీ కలవను)

1 comment:

  1. నువ్వు లేని శరీరంతో నేను
    శరీరంలేని నాతో నువ్వు చాలా బాగుందండీ!

    ReplyDelete