రాత్రిలోకి చూడనిది నువ్వొక్కదానివే
విసిగించాను. విసిగి వేసారిపోయాను
ఎన్నాళ్ళని వెన్నెల? ఎన్నాళ్ళనీ
నీ కరుణా వెన్నెల నీ కన్నుల?
రాత్రిలోకి చూడనిది నువ్వొక్కదానివే
వదనంతో వలయంతో శాంతి లేని కాంతితో
అలసిపోయాను. నీ నిర్ధయతో
నిస్త్రాణమయ్యాను రణమయ్యాను
రానివాడిని లేని వాడినీ అయ్యాను
ఏటి ఒడ్డున రాళ్లకూ
నీటి తడి ఉంటుంది
శిధిలాలలోని శిలలకూ
జీవం ఉంటుంది
రాత్రిలోకి నాలోకి చూడనిది నువ్వొక్కదానివే:
రాతి కన్నా రాత్రి రచన కన్నా
పూవు కన్నా ముల్లు కన్నా
కొండ కన్నా కొరివి కన్నా
కన్నా అంత
నిరార్ధక వార్తాహరుడనా నేను? అంత
నిరాశా నిశాచరుడనీ సహచరుడినా
నేను? నా మేనూ?
అలసిపోయాను. అలసి ఆగిపోయాను.
నిన్ను తాకిన చేతులలోనే ఇక నేను
ఒక చితి పేర్చుకుంటాను.
అందులో బహుభద్రంగా భారంగా
నా ముఖాన్ని దాచుకుంటాను
నిన్ను చూసిన కళ్ళలోనే ఇక నేను
ఒక సమాధిని తవ్వుకుంటాను.
బహు నెమ్మదిగా అందులో నా దూరాన్ని
దారినీ ఏర్పరుచుకుంటాను
విసిగిపోయాను
విరిగిపోయాను
అలసిపోయాను
రాత్రిలోకీ రాత్రి హృదయంలోకీ
చూడనిది నువ్వొక్కదానివే
ఎన్ని చినుకులు నిన్ను తాకినా
ఎన్ని పూలను తెంపుకు వచ్చినా
ఏం లాభం? ఏం హర్షం?
సర్వం శోకం. సర్వం వి/నాశనం.
రాత్రి రాత్రే. రేపు రేపే. కరగనిదీ
కలవనిదీ కలగా మిగిలేదీ నువ్వే.
చూడు: లిఖిస్తూ ఒక పదం
ఎలా ఒక లేఖయై
ఎవరికీ లేకుండా ఏమీ కాకుండా
ఎలా వెళ్ళిపోతుందో.
intha chetta kavitvam raasetappudu,
ReplyDeletekaneesam kontha manchi kavithvam chadavandi.
telsutundi, kavithavam ela raayalo,
voorike naalugu vaakyalu raayagaane kavi evaroo ayiporu.
ha ha ha. (am laughing my ass off): సరే. ఆ 'మంచి' కవిత్వం లిస్టు ఏదో ఇవ్వు. చదువుతాను. లేకపోతే మచ్చుకు నువ్వు రాసి చూపించు, నీకూ నాకూ. పైగా ఎవరు చెప్పారు నీకు ఇది కవిత్వమని? పేరు చెప్పుకునే ధైర్యం కూడా లేని, అస్తిత్వం లేని అ/నామకులకు ఇక ఇంతకంటే చెప్పాల్సిన అవసరం లేదనుకుంటాను.
ReplyDeleteమనసులోని భావావేశం మీ అక్షరాలలో కనిపిస్తోంది. ఎన్నాళ్ళని వెన్నెల? ఎన్నాళ్ళనీ
ReplyDeleteకరుణా వెన్నెల నీ కన్నుల? నాకిది బాగా నచ్చింది.
GOOD POEM
ReplyDelete