నీ రెండు కళ్ళూ
ఎండిన నేలగానూ, నేల రాలిన పక్షులగానూ, పక్షులపై
నెమ్మదిగా పేరుకుంటున్న సాయంకాలపు ధూళిగానూ
ధూళిలో చేరుకుంటున్న రాత్రిగానూ
మరి రాత్రుళ్ళలో, ఆ చీకట్లలో ఎవరూ
లేక, రాక, తెగిన ఆ కాంతి అంచులపై
మోకాళ్ళపై ఒరిగి, ముకుళిత హస్తాలతో ప్రార్ధించే, నువ్వు
కలవరించే దేహ/దేశ ద్రిమ్మరులుగానూ
ఎప్పుడు మారతాయో ఎవరికీ తెలియదు: అది సరే కానీ
మళ్ళా మరొకసారి ఇలా మొదలు పెడదాం ఈ కవితని-
నీ రెండు కళ్ళూ
ఎండిన నేలగానూ, నాగేటి చాళ్ళగానూ మారితే, కూర్చుంటావు
నువ్వు ఆ బీడు పడ్డ నేలలలో
ఎదురుచూస్తూ, ఎంగిలిపడక
కడుపులోకి తలను కుక్కుకుని, రాత్రంతా తాగినది కక్కుకునీ
మరి ఒక్కసారిగా శరీరం వణకగా
పెదాలపై నెత్తురిని తుడుచుకుని
'అమ్మా' అనుకుంటో, ఒక్కసారి
తల ఎత్తి చూస్తే, ఆకాశపు అనంతాలలో
ఒక తెల్లని కన్ను మొలుస్తుంది: ఎంతో
కొంత దానిలో నుంచి వాన కురుస్తుంది
ఎంతో కొంత మంచూ రాలుతుంది, నీ శరీరం ఘనీభవించి ఒక
ప్రాచీన శిలగా మారుతుంది- తల్లి పాల
వాసన ఏదో ఇక నీ చుట్టూతా, నీ లోపల ఆ కరవు నిండిన నేలలలో-
మరి నీతో, నెలలు నిండి తిండి లేక
చావుకి చేరువైన, ఆ ఆవు ఒక్కటే
ఒంటరిగా, ఇక ఎవరినీ కనలేని ఈ
నేలపై, నీ తల్లి వలే, నిను ప్రేమించిన స్త్రీల వలే, ఏమీ మిగల్చుకోలేని
తండ్రుల వలే, దేశానికి బలి అయిన
అనామకుల వలే, అనాధుల వలే-
PS:
సరే, సరే, ఇదేమిటో నాకు తెలియదు
మీకూ తెలియదు, అర్థం కాదు కానీ
మళ్ళా, మరొకసారి మనం
మొదలు పెడదాం
ఇలా ఈ 'కవితని'-
నా రెండు కళ్ళూ---
నీ రెండు కళ్ళూ---
తన రెండు కళ్ళూ, ఎవ్వరినీ, దేనినీ కనలేని మన అందరి రెండు రెండు నాలుగు కళ్ళూ---

No comments:
Post a Comment