నాలుగు వాక్యాలు రాసుకుందామనే, అంతకు మించి పెద్దగా కోరికలూ
ఏమీ లేవు - అరచేతుల్లోకి ముఖాన్ని ముంచుకుని
శుభ్రంగా కడుక్కుని, ఆపై
వీచే గాలితో తుడుచుకుని
కనులు మూసుకుని, ఒకసారి నిన్ను తలచుకుని
ఒక ప్రార్థన మొదలుపెడతాను -
ఎలా అంటే, గుండెను చీల్చుకుని
నెత్తురుతో కొట్టుకుంటున్న గుండెకాయని అరచేతుల్లో ఉంచి
ఆ లబ్ డబ్ సవ్వడిని నీకు
కన్నీళ్ళతో వినిపించినట్టూ
రాలిపోయిన ఒక జీవాన్ని, గుండెలకి హత్తుకుని ఏడ్చినట్టూ
చివరికి, ఏమీ చేయలేక ఒక
నిశ్శబ్ధపు ఆక్రందనతో నేలకి ఒరిగిపోయినట్టూ
స్పృహ తప్పినట్టూ: అదే అదే
ఒక మూగవాడి ఆఖరి సంజ్ఞా గీతం వలే, అతని చేతివేళ్ళ కంపన వలే-మరి
ఇలాంటి పచ్చిముల్లు ఎప్పుడైనా
అరిపాదంలో దిగి విరిగిపోయిందా
నీకు, తీయరానీయకుండా, అలాగే ఉంటూ సలుపుతూ?
ఇదే, నువ్వు రాయాల్సిన సరియైన రహస్య సమయం
నెత్తురు అంటిన ముల్లుతో, నీతో-
దా మరి, రాద్దాం ఒక ఇల్లాంటి నిన్నూ నన్నూ, ఒక పసిముల్లునూ-

ReplyDeleteనెత్తురు అంటిన ముల్లుతో, నీతో-
yes, there can't any other time.