31 May 2013

Bacardi bum

వొళ్ళంతా తీగలు, నీటి తీగలు అల్లుకుని, లోనికి సర్రున దిగుతూ ఉంటే, శరీరం సుర్రున జలదిరిస్తోంది. 

అరచేత్తో ముఖంపై నీటిని తుడుచుకుని, చీకట్లో కనీ కనిపించని రహదారిపై 'ఉంటానో, ఊడతానో ' అని అనుకుంటో, నేనసలే మా గుడ్డి మాలోకాన్ని కదా, ఈ చిన్ని చూపుల కళ్ళజోడుతో, ఈ తెల్లని అపాచీ అశ్వాన్ని వానలో అధిరోహించలేక, లేకుండా ఉండాలేకా 

ఎలాగోలాగా ఆ అపరాత్రి ఇంటికి 'చచ్చి బ్రతికితిరా' అనుకుంటో ఈదులాడుకుంటూ వచ్చీ వచ్చీ, వచ్చీ వచ్చీ, మరిక 

తల తుడుచుకుంటో, ఆగలేక, వంటింట్లోకి వెళ్లి, దాచుకున్నగూట్లో చూస్తే ఒక ఖాళీతనం- అతి భద్రంగా దాచుకున్న బకార్డీ బాటిల్ కనిపించక దాని కోసం వెదుకుతూ ఉంటే, ఎప్పుడూ లేని ప్రశాంతత కదులాడుతున్న గదులలో ఎన్నడూ లేనిది, పదకొండు గంటలకే పడుకున్న పిల్లల అర/దొంగ నిద్రల లోంచి

నడిచొచ్చి నెమ్మదిగా తను 'ఇందాక
అనుకోకుండా పడేసారు పిల్లలు' అని
తాపిగా చెబితే, అప్పుడు నమ్ముతావు నువ్వు ఖచ్చితంగా, విరక్తిగా- హతవిధీ ఇక 

దేవుడినీ, నరకాన్నీ, పాపాలనీ శాపాలనీ, ఖర్మనీ- ఆహ్ ఇదంతా నా తలరాత అనుకుంటో, గతిలేక, ఇటువంటి రాతలు రాసుకుంటో- అది సరే కానీ 

By the way, could you lend మీ,
(A) couple of shots
Of whisky or/
Vodka/

To this romantic/bombastic
Bacardi bum
Of the night? 

2 comments:

  1. శ్రీ, నా దగ్గరుంది ఇంకా ఓ మాన్నాలుగు పెగ్గుల మొయిని బకార్డీ. ఈ రాత్రి ఎట్టాగేనా... ఎట్టాగబ్బా... పిల్లలు (మమతా, అన్యా) ఒప్పుకోరే, ముఖ్యం అన్య... ఆడుకోడానికి రాకుండా ఏంటి నువ్వు హెచ్చార్కే అని... తాతా అనదు నన్ను, పేరుతోనే పిలుస్తుంది... నా 'ఆటలు' సాగనివ్వదే అని కుంచెం కుంచెం దిగులు పడుతుంటే ఇదిగో ఎప్పట్లాగే-అందమైన నీ పద్యమిచ్చిన ఆసరాతో.. రానున్న రాత్రి గురించి కలలు కంటూ, పోనీ కలలైనా కంటూ...
    (ఇప్పుడింకా ఈ వూళ్లో సాయంత్రం ఐదే :-) )

    ReplyDelete
  2. This comment has been removed by the author.

    ReplyDelete