వెదురు వనాల బుట్ట బొమ్మలా నువ్వు, తిరిగి తిరిగి ఇంటికి వచ్చినప్పుడు
మరి మన ఇల్లంతా కరివేపాకు వాసన
కొంత పుదీనా పచ్చదనం, చల్లటి తడీ-
మరి నీ కళ్ళలోంచి తొంగి చూస్తూ ఉంటాయి, కొత్తిమీరా
ఎర్రని టమాటాలు, మరికొన్ని చిలకడ దుంపలూ, ఇన్ని
ములక్కయలూ, మరికొన్ని పచ్చని ఆకుకూరలూనూ
ఇంత మట్టీ, వానా కలగలసిన సాయంత్రపు వాసనతో, నీ గాజుల చప్పుళ్ళలో ఇరుక్కుని-
ఇక నువ్వు అలసటగా కుర్చీలో కూర్చుని, చున్నీతో
నుదిటిన పట్టిన చమటని తుడుచుకుని
నావైపు చూస్తే, ఒక మంచినీళ్ళ బాటిల్ని
నీకు అందించి, ఇలా అంటాను నేను -
"ఈ పూటకి నేను వంట చేస్తాను. ఏం
తింటావూ? టొమాటో రైస్ చేయనా?"
ఇక, తెరిచిన తలుపులోంచి కొంత గాలీ, మరికొంత చీకటీ. ఎక్కడో సుదూరంగా
మిణుకు మిణుకుమంటూ, ఒంటరి
నక్షత్ర మొకటి మనలో. లోపలెక్కడో
ఆకులపై చినుకులు రాలి చేసే
ఒక మెత్తని సవ్వడీ - రుచీనూ-
ఆహ్- ఏమీ లేదు. ఒక రోజు ఇలా కూడా ఉండవచ్చుననీ, గడుస్తుండవచ్చుననీ
చెబుతున్నాను మీకు నేను, ఈ
ఎర్రెర్రని టొమాటోలు కడుక్కుంటో-
అది సరే కానీ, నా సంగతేమో కానీ
By the way, what are you eating
For tonight?

No comments:
Post a Comment