ఏమీ లేని వాణ్ని. తాకితే నీకూనూ అంటుకుంటుంది కొంత చీకటి-
చల్లగానూ, గరకుగానూ, కొంత చెమ్మతో
చేతులంత, కన్నీళ్ళంత లోతుతో గాత్రంతో-
చెప్పానుగా, ఏమీ లేని వాణ్ని. ఏమీ లేదు ఇక్కడ, నా వద్ద. త్రాగడం
-భస్మం అయ్యేటట్టు- ఎందుకయ్యా అంటే
అరచేతుల్లోని ముఖం భారమయ్యి, మరి
ఒక్కడినే ఒక్కడిని అయ్యి, ఎవర్నీ కానని
తెలిసి- అది సరే, ఇది అంతా ఏమిటీ అంటే, ఏమీ లేదు
ఆకులపై వాలిన వెన్నలని చూస్తావు నువ్వు
మరి అవే ఆకుల కింద, ఆకులని భీతితో, అంతిమ శ్వాసతో హత్తుకున్న
చీకటిని చూస్తాను నేను. ఇంతకూ
నీతో ఏదైనా తప్పు చెప్పానా నేను-?
No comments:
Post a Comment