ప్రపంచమంతా అంత ఎర్రగా ఏమీ కనిపించదు కానీ, చిన్ని చిన్ని ముళ్ళేసి
అది సరే కానీ మరేమో కానీ ఎవరి సంగతో మనకెందుకు కానీ
By the way
నులుముతున్నట్టు కొంత నొప్పి, కొంత చికాకూ- మరి
అప్పుడు నువ్వేం చేస్తావంటే, కాలంపై కన్నెర్ర జేయలేక
ఒక్కడివే నీ వాలు కుర్చీలో కూర్చుని, ఒక చల్లని తడి గుడ్డని చేతిలో ఉంచుకుని
పాల చుక్కలు వేసుకున్నా పసికన్ను కాని, మరి నీ ఆ
ఒంటరి కన్నుని అదుముకుంటో కూర్చుంటావు నువ్వు
ఒక్కడివే, నీపై నువ్వే కన్నెర్ర జేసుకుని, ముఖం ఇంతలా
మాడ్చుకుని, 'ఎందుకంత తాగితి రాత్రి, మరి ఎందుకంత
పీల్చితి ధూమమూ, కరడు గట్టిన జీవితపు చితాభస్మమేదో కన్నులలో రాలేటట్టూ
పదం పంచుకునే వారు లేక శరీరం మొత్తం శోకించేటట్టూ'
అని నువ్వు ఒక్కడివే అనుకుంటూ, అప్పుడప్పుడూ అద్దంలో ముఖం చూసుకుని
ఎరుపెక్కిన ఎడం కన్నుని ఒక మారు తుడుచుకుని, ఇక
ఇలా అనుకుంటావు నువ్వు, పదునెక్కిన వ్యంగ్యంతో ఒక
లోలోపలి వికటాట్టహాసంతో: 'హేహే రాజన్! ఉండెను ఇక్కడ
ఇంకా, ఒక ఒంటి కన్ను రాక్షసుడు, ఒంటి గంట రాత్రిలో
కనులలో మొలుచుకు వస్తున్న కొమ్ములతో, కోరలతో-
అయిననూ నేను బ్రతికే ఉంటిని చూడుడి, నన్నున్ జూసి
కనులలో నిప్పులు పోసుకును వారు ఇక నిశ్చింతగా మరి తెల్లని కనులతో నిదురించుడి-'
అది సరే కానీ మరేమో కానీ ఎవరి సంగతో మనకెందుకు కానీ
By the way
Have you ever got a red eye?
By the way
Have you ever got an eye?
I mean 'I'?
I mean 'I'?
No comments:
Post a Comment