"చెమ్మగిల్లిన రాత్రిని నువ్వు ఎన్నడూ చూడలేదు" అని నువ్వు అన్నావు ఆనాడు-
చీకట్లో ఈ వేళ, ఇంటికి తిరిగి వస్తూ ఉంటే, దారికి ఇరువైపులా
ఊగుతాయి విస్తృతంగా తుమ్మచెట్లు -
రాలే ఏ వెన్నెల చినుకులో కూడా మరి
ఆ ముళ్ళని తాకి రివ్వున చీరిపోతాయి
రెక్కలు తెగి, సీతాకోకచిలుకలో లేక సీతాకోకచిలుకల వంటి మనుషులో
మరి వాళ్ళూ ఇక్కడే, దిగంతాల
జీవన భారపు బరువుతో విరిగీ-
చెప్పడానికి ఏమీ ఉండదు. నువ్వు నీతో ఉంటే బావుంటుంది, అని నువ్వు
అనుకున్న వాళ్ళూ, ఎవరైతే ఉంటే
నువ్వు కళ్ళని తుడుచుకుని, రేపు
తిరిగి లేచి, కొంత బ్రతికేందుకు వెళ్ళగలిగిన వాళ్ళూ, వాళ్ళు నిన్ను వొదిలి
వెళ్ళిపోయాక, పెద్దగా రాయడానికీ
ఏమీ ఉండదు.మహా అంటే అయితే
ఒక మొద్దు తుమ్మ చెట్టుగా మారి, ఊగిపోతో తూలిపోతో, నిన్ను నువ్వే ఇక
చీరుకుంటూ కూర్చుంటావు. అది సరే
చెమ్మగిల్లిన రాత్రిని నేను చూసుండను
కానీ, చెమ్మగిల్లి, ఆ తడితో, ఆ మంచుతో
ఒక నిండు శరీరం రాత్రై , చిక్కటి చీకటియై
నింగిలోకి ఒక అరచేయై మరొక అరచేయికై చాచి, తపించీ తపించీ తపించీ
అతి నెమ్మదిగా గడ్డకట్టుకుపోతున్నఒక
మనిషిని చూసావా నువ్వు ఎన్నడైనా?
అని నేను అననూ, అడగనూ ఈనాడు-
మరేం లేదు, నీళ్ళంటిన కళ్ళతో, ఎండిపోయిన రాత్రిలోకి ఒక మాటను జారవిడిచి
నీ వంటి కన్నుని తోడుకుంటూ కూర్చుకున్నాను ఇక్కడ. ఇలాగ. చివరికి. చావుకి.
అంతే - ఇంతకంటే మరేం చెప్పను?

No comments:
Post a Comment