పాత్రలో ఇన్ని నీళ్ళు కాగబెట్టి, ఇన్ని నూకలు పోసి, ఉడికాక, ఇంత ఉప్పు వేసి, మరికొంత రాగి పిండి పోసి, కలిపీ కలిపీ, కలిపీ, చివరిగా ఇంత నెయ్యి పోసి కలిపి ఇక
ఒక ముద్ద సత్తు ప్లేటులో వేసుకుని, పాత చింతకాయ పచ్చడితో, ఈ చీకట్లో - చిన్నటి వెలుతురు మిణుకు మిణుకు మనే నేలపై కూర్చుని తింటావు నువ్వు
ఇక చేయదగిన గొప్ప కార్యమేదీ లేదు కనుక: ఇక ఈ పూటకి, మొక్కలకి నీళ్ళు పెట్టినట్టు, వడలిన పూలపై ఎవరో గాలిని చిలకరించినట్టూ, ఈ నీ శరీరానికి గుక్కెడు నీళ్ళూ, రాత్రి తేమా ఇచ్చి, నిదుర తోటలోకి అలసటగా పంపించడం తప్పితే
నిజానికి చేయడానికి ఏం ఉంది? రోజూ రాయాలనేం ఉంది? ఇలా కూడా ఉండవచ్చు నువ్వు. గాజుపాత్రలోని చేపపిల్లలా, ముడుచుకున్నకుక్క పిల్లలా, పిల్లి పిల్ల వలే గుర్ మంటో నిన్ను రుద్దుకుంటూ తిరిగే ఒక మెత్తటి అలసటతో, నెమ్మది అవుతున్న శ్వాసతో

రెండు చేతుల మధ్య ఒక దిండుని పుచ్చుకుని, కనులు మూసుకుని నువ్వు పడుకుంటే - అందులో తప్పేం ఉంది?
No comments:
Post a Comment