పూర్తి ధ్యాసతో, పెదాలు బిగపట్టి, సమస్థ విశ్వం అదే అయినట్టు
పూర్తిగా నిమగ్నమయిపోయి
చెక్కుతారు కదా పిల్లలు అలా
వంకర టింకరగా, ఆ పెన్సిల్ని
ఆనక గజిబిజిగా గోడలపైనో
కాగితాలపైనో, మరిక నీపైనో
బొమ్మలు వేయడానికీ, రాసుకోడానికీ, ముల్లు విరిగితే, తిరిగి
మళ్ళా చెక్కుకోడానికీ, మరి
నువ్వూ అంతే - అంతే శ్రద్ధతో
వేళ్ళ మధ్య పొందికగా పుచ్చుకుని, ఒక చిరునవ్వుతో, సహనంతో
నింపాదిగా చెక్కుతావు నన్ను-
(ఎలా అంటే, నేను, నువ్వు ఆడుకునే ఒక బొమ్మని అయినట్టూ
ఇక నిన్ను విడిచి నేను
ఎక్కడికీ వెళ్ళిపోలేనట్టు)
ఆఖరికి ఇక్కడ, ఇప్పుడు
చెక్కీ చెక్కీ చెక్కీ అలసిపోయి నువ్వూ, అరిగీ అరిగీ అరిగీ, ఇక
ఏమీ మిగలక, గాలికి కొట్టుకు
వెళ్ళే చెక్కపొట్టునై నేను -ఇక
ఈ కాగితంపై మిగిలేది ఎవరు?

కాదేదీ కవితకి అనర్హం!
ReplyDelete